Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11961

మగవాఁడు మాయకాఁడు యీ

రాగము: శ్రీరాగం

మగవాఁడు మాయకాఁడు యీ
జగడంపుఁ జనవులు సతములౌనోయమ్మ॥పల్లవి॥
  
  
నిండిన నీమది నాతఁడు నిజముగ
నుండంగానే ఉడికే వేలె
అండల యాసల నాఁకలా యిటువంటి
యెండ చూపులను దప్పులేల తీరునోయమ్మ॥మగ॥
  
  
మందపు నవ్వుల నాతఁడు మాటలు
చిందంగానే చిమిడే వేలె
అందియు నందని యాసల నిటువంటి
చందమామగుటకలు సతము లవునా యమ్మ॥మగ॥
  
  
కలికి వేంకటరాయఁడూ కౌఁగిట
నలరంగానే అలసేవేలె
చెలువఁ డాతతి చేఁతల నిటువంటి
తొలు మించు మెఱుఁగులు తొడవులౌనాయమ్మ॥మగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!