Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11973

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: రామక్రియ

మగువ గుంపెన నీకు మంచిదాయను
తగవులఁ బెట్టఁగానే తమి రేఁగెను॥పల్లవి॥
  
  
చలము సాదించేనంటా సతి నిన్ను జంకించితే
చెలరేఁగి లోలోనిసిగ్గు దేరెను
బలిమి నీవు సేయఁ గాఁ బట్టిపెనఁగఁ జూచితే
యెలమిఁ జన్నులపై పయ్యద జారెను॥॥
  
  
తరితీపు సేసేనంటా తగుల మాటలాడితే
గొరబైనవలపు లుంకువలాయను
కెరలించేనంటా నిన్ను కెంగేలు వట్టితేను
సురతకాంక్షలకును చోటాయను॥॥
  
  
కడునలయించేనంటా కాఁగిట బిగించితేను
జడిగొన్న వేడుకలు సతమాయను
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగ యిట్టె
కడఁగి వురమెక్కితేఁ గాణాచి ఆయను॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!