Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11986

మగువరో యీగతినే మగని వలపించవే

రాగము: బౌళిరామక్రియ

మగువరో యీగతినే మగని వలపించవే
జిగి మఱవకుమీ నేఁ జెప్పిన యీ బుద్దులు॥పల్లవి॥
  
  
మనసు లెనసితేను మాటలెల్లాఁ జపులౌను
ననుపు గలిగితేను నవ్వులు వచ్చు
చనవుమెరసితేను సంగాతము లీడేరు
వినయము చూపితే వేడుకలౌఁ బొందులు॥మగు॥
  
  
అడియాసలు మించితే ఆయములు గరఁగును
యెడవాయకుండితేను హెచ్చు లంకెలు
వుడివోనిప్రేమలైతే వొనరుఁ దలపోఁతలు
అడరుఁ జుట్టరికములైతే నింపు లెసఁగు॥మగు॥
  
  
విచ్చన విళ్తైతేను వలెయుఁ దమకములు
ముచ్చటలు నెరపితే ముంచుఁ గళలు
ఇచ్చట శ్రీవేంకటేశుఁడేలే నిన్ను నింతలోనె
పచ్చిదేరఁ జెనకితిఁ బరగును రతులు॥మగు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!