Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11998
మగువా నీవూ నొక్కటే మమ్ము నలయించనేల
రాగము: నాదరామక్రియ
మగువా నీవూ నొక్కటే మమ్ము నలయించనేల | |
యెగసక్కేలు చెలులే యింతసేసి రందురు | ॥పల్లవి॥ |
చేయివట్టి తియ్యఁగాను చెల్లఁబో జాగుసేసేవు | |
వేయిటికివి చెలికి విన్నవింతుమా | |
ఆయెడ నెదురుచూచీ అంగన మాసుద్దులకు | |
పాయక ఆనతీవయ్య పరాకులేమిటికి | ॥॥ |
ఆనవెట్టి పిలువఁగ నంగనలతో నవ్వేవు | |
వైసవై నాలుగ నన్ని వ్రాసెంపుదమా | |
మానవతి లోననుండి మరీ దూతికం నంపె | |
దానికేమనే వయ్య యీతరి గుట్టేమిటికి | ॥॥ |
వొత్తరించుకొని రాఁగా నువిద నిట్టే కూడితి- | |
విత్తల శ్రీవేంకటేశ యెచ్చరింతుమా | |
తత్తరానఁ గమ్మటిని తరుణి సన్నలు సేసీ | |
చిత్తగించి యేలవయ్య సిగ్గులిప్పు డేఁటికి | ॥॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు