Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12020

మట్టుతోనే సొలయవే మగనితోను

రాగము: ముఖారి

మట్టుతోనే సొలయవే మగనితోను
దిట్టవై పదరితేను దిద్దుకొనరాదు॥పల్లవి॥
  
  
మాఁటలాడవచ్చుఁగాని మర్మములు నాఁటితేను
గీఁటించి మీఁదటఁ బెల్లగించంగరాదు
కాటుకకన్నుల సన్న గావించవచ్చుఁగాని
పోటీవెట్టి యడిగితే పోల బొంకరాదు॥మట్టు॥
  
  
నవ్వు నవ్వవచ్చుఁగాని నడుమ నెగ్గువట్టితే
వువ్విళ్ళూర మందువోసి వుడుపరాదు
పవ్వళించి వుండఁగాను పాదా లొత్తవచ్చుఁగాని
చివ్వనఁ గాఁగిలించితే సిగ్గువడరాదు॥మట్టు॥
  
  
మొక్కు మొక్క వచ్చుఁగానిమోములఁటుకొంటేను
కక్కసించి నీరువోసి కడుగరాదు
అక్కున శ్రీవేంకటేశు కలమేల్మంగవు నీవు
ఇక్కడ నన్నేలినాఁడు యెలయించరాదు॥మట్టు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!