Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12037

మదము దొలఁకెడియట్టి మంచివయసున మనకు

రాగము: సామంతం

మదము దొలఁకెడియట్టి మంచివయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా॥పల్లవి॥
  
  
ఉదుటుఁ జనుదోయి నీవురముపై దనివార-
నదిమి మోమును మోము నలమి యలమి
వదలైన నీవితో నాలుఁగన్నుల జంకెఁ
లొదవ నీ మీఁద నే నొరగుటెన్నఁడురా॥మదము॥
  
  
కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము
కులికి నీ వదనమునఁ గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి
చెలువమగు నునుగంటి సేయుటెన్నఁడురా॥మదము॥
  
  
గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నిను గూడి నే-
నరమరచి సదమదములౌట యెన్నఁడురా॥మదము॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!