Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12085

మనోభావకుఁడవు మగువ మిక్కిలి జాణ

రాగము: కన్నడగౌళ

మనోభావకుఁడవు మగువ మిక్కిలి జాణ
అనేక విన్నపము లందులోనే వున్నవి॥పల్లవి॥
  
  
వంచినరెప్పలవెంట వడిసిన కన్నీరు
కొంచక నీమీఁదఁ జెలి గోరఁ జిమ్మీని
యెంచి నీ విందాఁక రాక యింత నేసినయందుకు
పొంచి నీకు నక్కునఁ బోసి చూప వలదా॥మనో॥
  
  
సారె నాకొప్పువిరులు సరి నొక్కొక్కటే తీసి
దార దప్ప కుండ నిన్నుఁ దాఁక వేసీని
రా రమ్మనీ పిలువఁ బరా కై వుండినందుకు
వూర కుండి తనపాటు వొప్పగించ వలదా॥మనో॥
  
  
వెట్టఁ బొరలిన దై వెస నిన్నుఁ గాఁగిలించె
అట్టె తన అసురుసు రదె చూపీని
ఱట్టుగ శ్రీవెంకటేశ నెట్టనఁ గూడి తీడనె
దిట్టయి నీసేసినమేలు దిగఁ బోయ వలదా॥మనో॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!