Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12141

మరిగేమీ నెఱఁగను మంకు గొల్లదాన నేను

రాగము: మాళవిగౌళ

మరిగేమీ నెఱఁగను మంకు గొల్లదాన నేను
సరిలేని నవ్వులతో సరసమాడుదును॥పల్లవి॥
  
  
బలిమి నేఁ జేయఁ గాని పంతమాడి నిన్నునిట్టె
వలపించి నీ మోము వాడు దేర్తును
చలము సాదించఁ గాని చనవు చేసుక నీ
వెలలేని మోవెల్లా వేడుకల నింతును॥మరిగే॥
  
  
బొమ్మల జంకించఁ గాని పొద్దు పొద్దుఁ గాచుకుండి
సమ్మతించ నీ మనసు జట్టిగొందును
చిమ్ముచుఁ గొసరఁ గాని చేతులు నీపైఁ జాచి
ఉమ్మడి నా గోరి కొనలొడలెల్ల నింతును॥మరిగే॥
  
  
నేరమెంచఁ గాని నేను నీతోనే మాఁటలాడి
చేరువ నీ మన్ననలు చేకొందును
యీరీతి శ్రీ వేకంటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పేరుకొని యిఁక నిన్ను ప్రియాన మెప్పింతును॥మరిగే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!