Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12151

మరులుకొలుపఁ జోటులేదు మాకు బొంక నెడము లేదు

రాగము: సామంతం

మరులుకొలుపఁ జోటులేదు మాకు బొంక నెడము లేదు
సరస నాయకుఁడవు నీకు చందమాయఁగా॥పల్లవి॥
  
  
కరఁగి కరఁగి చెలియ పేరు కలవరించి నుడుగువంక
మరిగినట్టిపొందులౌత మాకుఁ దెలిసెఁగా
వెర వెఱుఁగకుండువంక వింత లాలకించువంక
తరతరంబుఁ బాయరానితగులు దెలిసెఁగా॥మరు॥
  
  
నిలిచి నిలిచి చొక్కువంక నీలోనినవ్వువంక
చెలికి మేలువాఁడీవౌతా చెలువు మిగిలెఁగా
పలికి పలికి భ్రమయువంక బహుపరాకులైనవంక
కలిగినంత మోహమెల్లఁ గాన వచ్చెఁగా॥మరు॥
  
  
ఇట్టునట్టుఁ జూచువంక యేకతాన నుండువంక
అట్టె చెలియఁ గూడురతుల ఆస దెలిసెఁగా
పెట్టుకొన్న సేసవంక పండ్లి శ్రీవేంకటేశ
గట్టిగాఁగ సతికి నీకుఁ గలుగు టాయఁగా॥మరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!