Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12153

మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు

రాగము: కుంతలవరాళి

మరుఁడు సేసిన మాయ మగలకు నాండ్లకు
విరసాలు వుట్టవు వేడుకే కాని॥పల్లవి॥
  
  
యెంత దూరి మాటాడినా యింపు లయ్యే వుండుఁగాని
పంతము రేఁగ దింతిపైఁ బతికి
పొంతనుండి సారె సారె బొమ్మల జంకించినాను
వింతలు దోఁచవు మరి వేడుకే కాని॥॥
  
  
చలపట్టి సరసము జరయుచు నాడినాను
అలయిక వుట్టదు దేహమునకును
పెలుచుఁ దనాన మరి పెనఁగులా టాడినాను
వెలయ వేసటగాదు వేడుకేకాని॥॥
  
  
మిన్నక కొసరి మందె మేళ మెంత సేసినాను
అన్నిటా లోలో నెగ్గులై మించవు
యెన్నఁగ శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!