Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12154

మరుఁడు సేసిన మాయ మరి తెలియదు గాక

రాగము: కన్నడగౌళ

మరుఁడు సేసిన మాయ మరి తెలియదు గాక
సరవు లిద్దరివిని సరికి బేసాయనా॥పల్లవి॥
  
  
చనవు సేసుక నిన్ను సరిఁ గొంగు వట్టితిని
యెనసి యింత నేయ నీ యీడుదాననా
పెనఁగ కంతలో నీవు బెరసి లో నైతిని
ననిచి కరణ యింత నా మీఁద నుండెనా॥మరుడు॥
  
  
నవ్వు నేసుకొని నీపై నలిఁ జేయి వేసితిని
రవ్వ నిన్నింత నేయ బీరపుదొరనా
చివ్వన నీ వప్పటిని చేరి బత్తి సేసేవు
యివ్వల నీ మోహము నన్నింత దొడ్డ సేసెనా॥మరుడు॥
  
  
బలిమి సేసుక నే నీపయిఁ జేయి వేసితిని
కలసితి వింతేసికిఁ గలనా నేను
నెల వై శ్రీవెంకటేశ నీ వింకాఁ జెక్కు నొక్కేవు
సలిగె లిన్నియు నీవె సమ్మతించితివా॥మరుడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!