Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12185

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: సాళంగం

మఱి తరువాతఁ దానే మన్నించీ నన్ను
యెఱిఁగించి రమణుని నీడకుఁ దోడి తేరే॥పల్లవి॥
  
  
వేడుకలు తనుపేరు వీనుల వింటేఁ గలుగు
సూడిదె కోరిక తన్నుఁ జూచితేఁ గల్గు
అడుకొన్నబాసమాట లాడుకొనఁ గానే కలుగు
వాడిక తనకాఁగిటఁ గూడితేఁ గలుగును॥॥
  
  
జమళిసిగ్గులు దన్ను చన్నుల నొత్తితేఁ గల్గు
తమకము దనపొందు దక్కితేఁ గల్గు
సమరతులెల్లా మోవి చవిగొంటేనే కలుగు
చెమటలసాములు చెనకితేఁ గలుగు॥॥
  
  
మన మచ్చిక తాను మన్నించితేఁ గలుగు
ననుపులు నటనలు నవ్వితేఁ గల్గు
యెనసె శ్రీవేంకటేశుఁడే నలమేల్మంగను
పను నీడేరెను తనుఁ బాయకుండాఁ గలుగు॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!