Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12216

మఱివేళ లేదా మనసు నిలుపరాదా

రాగము: హిజ్జిజి

మఱివేళ లేదా మనసు నిలుపరాదా
గుఱిగా నిప్పుడే నన్నుఁ గూడఁగ వలెనా॥పల్లవి॥
  
చెఱఁగు మాసినదాన సిగ్గువడుచున్నదాన
జఱసి సరసమేల సారెనాడేవు
చిఱునవ్వుతో నుందాన చెమటచిత్తడిదాన
యెఱుఁగుదువన్నియును యేమి బాఁతి నేను॥మఱి॥
  
చెదరుఁ గురులదాన చేయత్తి మొక్కేదాన
అదనెఱఁగక యేల అంటవచ్చేవు
మదమొలికేటిదాన మాటున నుండేదాన
యిదివో యిట్టున్న దాన నేమిబాఁతి నేను॥మఱి॥
  
మంచముపైనున్న దాన మతిలో లోఁగేదాన
యించుకంతా సిబ్బితిలేకేల కూడేవు
మంచి శ్రీవేంకటేశ నీ మనసు చూచినదాన
యేంచక నన్నేలితివి యేమిబాఁతి నేను॥మఱి॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!