Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12251

మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను

రాగము: పాడి

మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను
చేకొని ఇట్టె అందాలు సేసుకొంట గాక॥పల్లవి॥
  
  
చెక్కులపై చెమటలు చిగిరింపుఁ బలకలు
యెక్కడి వనెడిగితే నేమందువొ
ముక్కున నిట్టూరుపులు ముంచిన మోముకళలు
నెక్కొనె నీకనియంటే నీచిత్త మెట్టుండునో॥మాకే॥
  
  
కనుఁగొనల నిద్రలు కాయముపై యలపులు
ఘనమాయనంటే నెంత కాఁతాళింతువో
వెనుకొన్న సన్నలును వేవేలు తమకములు
పెనగొనీనంటే యెంత బీరములాడుదువో॥మాకే॥
  
  
పెదవిపై వసివాడు పిక్కటిలుఁ బరాకులు
యిదివోయని చూపితే నెంత మెత్తువో
అదన శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
కదిసి గరిసించితే కైవస మెట్టౌదువో॥మాకే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!