Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12286

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: దేవగాంధారి

మాతో నేమి చెప్పేవు మాపు దాఁకా సుద్దులు
నీతి విచారించుకొంటే నీవెఱఁగవా॥పల్లవి॥
  
  
నమ్మిక గావలెనని నవ్వు దెచ్చుకొనెఁగాక
కొమ్మమనసులోపలికోప మారెనా
సమ్మతించవచ్చునా చల్లజంపు లివిగాక
నెమ్మి నీచేసినచేఁత నీ వెఱఁగవా॥॥
  
  
మచ్చిక చూపవలసి మాటలాడె నింతెకాక
కచ్చుపెట్టుకున్నయలుకలు దీరెనా
మెచ్చఁదగునా యివి మిక్కిలి కాఁకలుగాక
నిచ్చలపు నీగుణాలు నీ వెఱఁగవా॥॥
  
  
వలపు రేఁచేనని వంకచూచె నింతెకాక
తలపులో నెంజరి వింతటఁ బాసెనా
యెలమి శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
నెలకొన్న నీమహిమ నీవెఱగవా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!