Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12296

మాతో నేఁటికి నేను మగువ నింతే । నీ-

రాగము: ముఖారి

మాతో నేఁటికి నేను మగువ నింతే । నీ-
చేఁతలెల్ల యేడనైనాఁ జేయవయ్యా॥పల్లవి॥
  
  
జలధి యీఁదేచోట, శైలము మోచేచోట
సొలసి నీబలిమెల్లఁ జూపవయ్యా
యిల దవ్వఁబోవుచోట, హిరణ్యునిఁ జంపుచోట
పలుకుఁబంతాలెల్లఁ బచరించవయ్యా॥మాతో॥
  
  
నీవు మిన్నందేచోట, నెత్తుటఁ దోఁగే చోట
సోవల నీమురిపేలు చూపవయ్యా
దీవుల కేఁగేచోట, తెగి వెన్న దినుచోట
చేవదేర మాయలెల్లాఁ జేయవయ్యా॥మాతో॥
  
  
సిగ్గులదేరుచోట, చెంతలఁ బారేచోట
యెగ్గులుదప్పులుఁ బోయి యెంచవయ్యా
అగ్గమైతి శ్రీవేంకటాధిప నన్నుఁ గూడి
వెగ్గళపుకపటాలు విడువవయ్యా॥మాతో॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!