Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12372

మాపు దాఁకా సుద్దులేల మఱఁగు మొఱఁగులేల

రాగము: కాంబోది

మాపు దాఁకా సుద్దులేల మఱఁగు మొఱఁగులేల
చేపట్టి నీ వింకఁ జేసినట్టు చేయరా॥పల్లవి॥
  
  
వంపునీగోరిగుఱుతు వాఁసుకొన్నది నా మేన
యింపులఁ గాచినది నీయింటివాకిలి
ముంపున నాతురుము నీముంజేతి సేసలకే
చెంప జారె నీ వింకఁ జేసినట్లు సేయరా॥మాపు॥
  
  
యె త్తినవి నాచేతు లివె నీ మొక్కులకే
పొత్తు నీకాఁగిటికి నావూఁపచన్నులు
హత్తిన నాజవ్వనమంతా నీకే మీఁదు
చిత్తగించి నీవింకఁ జెసినట్టు సేయరా॥మాపు॥
  
  
యిచ్చితివి నీరూపు యిదె నామతికి దక్క
వచ్చితివి నేఁడు నావద్దకి నీవు
యిచ్చగించి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
చెచ్చెర నేమైనా నింకఁ జేసినట్టు సేయరా॥మాపు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!