Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12401

మాయలు మాని నాతో మాటలాడరా

రాగము: పాడి

మాయలు మాని నాతో మాటలాడరా
నాయడ మునిముచ్చుఁ దన మేల నీకు॥పల్లవి॥
  
  
ఆరయ నాకెవంతూ ననేవు నీ వప్పటిని
నేరుపున నాపెమోము నేఁడు చూడవా
కేరి కేరి నవ్వేవు కేఁగండ్లఁ జూచుకొంటా
యేరా లే దటరా యీ మాట నీవు॥మాయలు॥
  
  
బత్తి నాకు గల నంటాఁ బాయవు నీ వాపెకు
హత్తిన చెలిచేఁ జెప్పి యంప వామాఁటా
వత్తివలెఁ బైఁ బడేవు వట్టి చనవు సేసుక
ఉత్తర మీరా యిందు కూరకుండేఁ గాని॥మాయలు॥
  
  
యేపున నన్నే కాని యెవ్వరి నొల్లననేవు
ఆపె సొమ్ములె కావా అట్టె నీమేన
రాపుగా శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
ఆపను లిన్నాళ్లదాఁకా నమరెఁ గా నీకు॥మాయలు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!