Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12447

మిక్కిలి నేరుపరివి మేలు మేలోయి

రాగము: ఆహిరి

మిక్కిలి నేరుపరివి మేలు మేలోయి
గుక్కని వలపుల వో కోన చెన్నరాయఁడా॥పల్లవి॥
  
  
గారవించి నామనసు కరఁగించ వచ్చేవు
వారకపు వలపుల దేవరవు గావా
పేరడి నీపెనపుల ప్రియములనె నన్ను
కూరిమి గొసరెటి వో కోన చెన్నరాయఁడా॥మిక్కిలి॥
  
  
మెచ్చి మెచ్చి నాతో నమ్మికమాఁట లాడేవు
తచ్చన వినయాల యాతఁడవు గావా
ముచ్చట నీజాణతనములనె నామీఁద గుది
గుచ్చేవు మాయ లెల్లాఁ గోన చెన్నరాయఁడా॥మిక్కిలి॥
  
  
యెన్నికసరసాల నా కిచ్చకాలు సేసేవు
కన్నెవలపు వేడుకకాఁడవు గావా
నన్ను నిట్టె శ్రీవెంకటనాథుఁడ కూడితివి
కొన్నదె కో లిఁక నీకుఁ గోన చెన్నరాయఁడా.॥మిక్కిలి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!