Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12458

మిగిలిన దే మిఁకమీఁదట దేహికి

రాగము: శంకరాభరణం

మిగిలిన దే మిఁకమీఁదట దేహికి
అగపడు నొక పడెఁ డన్నంబు॥పల్లవి॥
  
  
రతిఁ బగటి వెలుఁగు రాత్రిచీఁకటికి
సతము గాదు అది సరికి సరి
అతిభోగములకు నార్జించుటకును
చతురపు సంపద సరికి సరి॥మిగి॥
  
  
అలయ పథ్యమున కౌషధము గొనుట
చలువకు వేఁడికి సరికి సరి
నిలిచిన పుణ్యము నిండుఁబాపములు
జలువు వెలువులకు సరికి సరి॥మిగి॥
  
  
మహి మరణములకు మరి పుట్టుగులకు
సహజ మందరికి సరికి సరి
యిహమున శ్రీవేంకటేశ్వరుఁ డాత్మకు
సహకారి యతఁడు సరికి సరి॥మిగి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!