Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12523

ముగుద ముగుదతనమునఁ బుచ్చెఁ గాలమెల్ల

రాగము: వసంతం

ముగుద ముగుదతనమునఁ బుచ్చెఁ గాలమెల్ల
తగిలి నీ కాఁగిటిలో దగదేరు టెన్నఁడో॥పల్లవి॥
  
  
తళుకున నిన్నుఁ జూచి తలుపుమాటున కేఁగె
కలికిసిగ్గుల కిఁక కడ యెన్నఁడో
యిల నీవు వటాడ నిటు కాలిగోర వ్రాసెఁ
దలవంచి యిఁక మారుత్తర మెన్నఁడో॥ముగు॥
  
  
పాడిపాడి నీవు రాఁగాఁ బక్కనఁ దానము గుక్కె
తోడనే యీసిబ్బితి కిఁక తుద యెన్నఁడో
కూడఁ జెలితో నవ్వఁగ గోబ్బున నీవు నవ్వితి
గోడచి త్తరువు చూచీఁ గొంకుదేరు టెన్నఁడో॥ముగు॥
  
  
పానుపఁ మీఁదికిఁ దోసి పచ్చిగాఁ గూడఁగాను
మేనిలోనే జునిఁగీ మేల మెన్నఁడో
మానక శ్రీవేంకటేశ మంతినాన నుండఁగాను
తా నూరకే వుండీ దంటతన మెన్నఁడో॥ముగు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!