Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12540

ముద్దుగారఁగా నిదె ముంగిట నిలుచున్నాఁడు

రాగము: భూపాళం

ముద్దుగారఁగా నిదె ముంగిట నిలుచున్నాఁడు
వొద్దికేఁగి చెలులెల్ల వూరడించరే॥పల్లవి॥
  
  
వేఁకువజామున లేచి వేడుక క్రిష్ణుఁడు తల్లి
ఆంకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి
కాంకలతో వసివాడి కన్నులు పులుముకొంటా
యేఁకరుచు నున్నవాఁడు యెత్తుకోరే బిడ్డని॥ముద్దు॥
  
  
బాలులతో వూరనెల్లఁ బరువులు వెట్టి పెట్టి
చాలుకొని యాడి యాడి జామెక్కంగా వచ్చి
కేలుచాఁచి వెన్నడిగి కిందుపడీ యంతలో
బేలులై వుండఁగనేల పెట్టరే బిడ్డనికి॥ముద్దు॥
  
  
మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే
చట్టులపెరుగు వేండీ చాలఁ బెట్టరే మీరు
పట్టపుశ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె
అట్టిట్టనక వీని నాదరించరే॥ముద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!