Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12543

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: నాదరామక్రియ

మునిముచ్చు వలపుల ముసగస లేమిటికి
పెనఁగి యచ్చమై యిట్టె బెరయఁగరాదా॥పల్లవి॥
  
  
సందడి గొలువు సేసి సన్నలు మోవినే చూపి
చిందుకొనేవు చెమట చెక్కులవెంట
పొందు లింత గలిగితే బోరున సేసలు చల్లి
పెందలకాడే నీవూఁ బెండ్లాడరాదా॥॥
  
  
చిఱునవ్వు నవ్వుతాను సిగ్గులువడుకొంటాను
కఱఁగేవు లోలోనే కాంతునిఁ జూచి
మొఱగుఁలింత నీకేల మోహించినదానవైతే
మెఱసి కాలుదొక్కి మేలమాడరాదా॥॥
  
  
పేరటాలపై వచ్చి బిగ్గెఁ బసవు నలఁచి
కోరి చన్నులనొరసుకొనే వాతని
యీరీతి శ్రీవేంకటేశుఁడే నల మేలుమంగను
చేరి నన్ను గూడె నీవూ సేవ సేయరాదా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!