Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12546

మునుకొన్న సిగ్గులతో మోము వంచ నేమిటికే

రాగము: ముఖారి

మునుకొన్న సిగ్గులతో మోము వంచ నేమిటికే
దిన దిన భోగముల తెప్పఁదేలగదే॥పల్లవి॥
  
  
చెలుములు సేయఁగానే చిగిరించు మోహములు
పలుకులవల్లఁ గొంత పదనెక్కును
సెలవుల నవ్వులను చిత్తములు గరఁగును
కొలువులు సేసి పతిఁ గొసరఁగఁగదవే॥మును॥
  
  
సరసము లాడఁగానే చవులెల్లా నుప్పతిలు
మరిగించుకొంటేను మర్మము లంటు
సరి నెదురు చూపుల జడిగొను వేడుకలు
బెరసి విభుని రతిఁ బెడరేఁచఁగదవే॥మును॥
  
  
చన్నుల నొరయఁగానే సంతోసా లొనఁగూడు
సన్నలా చాయలనే యాసలు వుట్టును
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డిట్టె వచ్చి నిన్నుఁ గూడె
పన్నుక యీతని నెడవాయకుండఁగదవే॥మును॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!