Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12557
మురిపెములెల్లా నీముందరనే పచరించీ
రాగము: ఆందోళి
మురిపెములెల్లా నీముందరనే పచరించీ | |
నెరవాదితనమెంత నేరుచునో తాను | ॥పల్లవి॥ |
కట్టుకొనె మెడనిండా గట్టి ముత్తెపు సరులు | |
పెట్టుకొనెఁ గొప్పన సంపెంగవిరులు | |
దట్టముగఁ బయ్యదలో దాఁచెను కుచగిరులు | |
అట్టె చిత్తగించి చూడవయ్యా యీపెదిక్కు | ॥మురి॥ |
పూసెను గందము మేన పొంచి నెరపూఁతను | |
ఆసలనే చూపీ నొయ్యారి చేఁతలు | |
వేసరక మొరయించీ వెస మట్టెల మోఁతలు | |
సేసవెట్టి యేలవయ్యా చెలి నీకుఁ గలిగె | ॥మురి॥ |
మెలుపున నించుకొనె యేనెల్లా సొమ్ములు | |
కులికీ వీణెలోఁ గొనగోరి చిమ్ములు | |
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు | |
పిలిచి మాఁటడవయ్య ప్రియురాలు నీకు | ॥మురి॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు