Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12570

ముందటికి వెనకకు మొక్కేము నీకు

రాగము: దేసాళం

ముందటికి వెనకకు మొక్కేము నీకు
కందువ లన్నియు నీవె కనుకొమ్మీ యిఁకను॥పల్లవి॥
  
  
యిచ్చక మాడితి నేఁడు యింటికి నీవు రాఁగాను
కొచ్చి నిన్న రాకుండఁగఁ గొసరితిని
బచ్చెన వేఁడివలపు పచ్చి దోఁచి చిగురాయ
తచ్చి తొల్లిటియలుక తలఁచకు మిఁకను॥మంద॥
  
  
కమ్మి నీవు చూడఁగాను కాను కిచ్చితి విప్పుడు
తమ్మిని వేసితిఁ దొల్లి తల వంచఁగా
వుమ్మగిలి నాసరస మొగ రెక్కి నిండఁ బూచె
దిమ్ము రేఁగినచలము తిప్పుకోకు మిఁకను॥ముంద॥
  
  
గక్కన నీవు గూడఁగ గాఁగిలించుకొంటి నిట్టె
మెక్కలాన నల్లప్పుడు మొరఁగితిని
చిక్కన య్యనును నాయఁ జిత్తము శ్రీవెంకటేశ
నిక్కి నీకపటములు నెరపకు మిఁకను॥ముంద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!