Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12584

ముందుముందె యింకనైన మోసపోకువయ్య నీవు

రాగము: సామవరాళి

ముందుముందె యింకనైన మోసపోకువయ్య నీవు
మందయాన వాసికోడీ మనసెరంగదా॥పల్లవి॥
  
  
సిగ్గుగలయాఁటది చేరఁ బిలువక యుంటే
యెగ్గులెంచక విభునినేల మానునే
దగ్గరి యంతలో వచ్చి తానెంత వేఁడుకొనిన
కగ్గినట్టి తనలోని కపటాలు మానునా॥ముందు॥
  
  
ననుపు గలుగుదాని నవ్వుతో మాటాడకున్న
యినుమడి గోపగించకేల మానును
వినయాలిప్పుడు వచ్చి వేవేలు సేసినాను
నినుపుల పెదవిపై నిష్టూరాలు మానునా॥ముందు॥
  
  
మరిగిన కాంతను మరఁగువెట్టేనంటే
యిరవై పైకొనుఁగాక యేల మానును
అరుదై శ్రీవెంకటేశ అతివఁ గూడితివిట్టె
సిరులంటుఁగాక సేసినమేలు దాఁగునా॥ముందు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!