Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12627

మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి

రాగము: దేవగాంధారి

మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి
హెచ్చె నీ సింగారాలు యెక్కడ చూచినను॥పల్లవి॥
  
  
అరిదిచెక్కులమీఁది యంగనకస్తూరివూఁత
కరఁగి నీచెంపలపై కారివుండఁగా
దొరతనాలు సేసేవు తొయ్యలులలోననెల్లా
యిరవాయ నీయెమ్మె యేమిచెప్పేది॥మెచ్చి॥
  
  
కోమలిగుబ్బలమీఁదికుంకుమగందపుఁబూఁత
ఆముకొని నీవురాన నంటివుండఁగా
సాముసేసేవానివలె సతులకుఁజూపేవు
నే మెఱఁగమా నీవు నెరజాణవౌట॥మెచ్చి॥
  
  
పొలఁతిమైనలఁదినపొడికప్పురపుపూఁత
నెలకొని రతివేల నీపై నంటఁగా
కొలువులో మాకుఁ జూపి కూడితివి మమ్మిందరి
తలఁచమా శ్రీవేంకటోత్తమనీమహిమలు॥మెచ్చి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!