Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12645

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: సాళంగం

మెఱుఁగువంటిది యలమేలుమంగ
అఱిముఱి నవ్వీని అలమేలుమంగ॥పల్లవి॥
  
  
పలచనియెలుఁగునఁ బాడీ నీమీఁదిపాట
మెలుపుఁగూరిమి నలమేలుమంగ
చెలులతో నీసుద్ది చెప్పిచెప్పి కరఁగీని
అలయుచు సొలయుచు నలమేలుమంగ॥॥
  
  
యీడుగా నీరాకకు నెదురెదురు చూచీ
మేడమీఁద నుండి యలమేలుమంగ
వాడుమోముతో నీపై వలపు చల్లిచల్లి
ఆడీ నాట్యము సారె నలమేలుమంగ॥॥
  
  
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను నలమేలుమంగ
యీరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడెఁ నేఁడు
ఆరితేరె నన్నిటాను అలమేలుమంగ॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!