Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12689

మేలయ్యా నీ సుద్దులకు మెచ్చితి నేను

రాగము: ఆహిరి

మేలయ్యా నీ సుద్దులకు మెచ్చితి నేను
నీ లాగు లొరసితే నేఁడు గొత్తయ్యీనా॥పల్లవి॥
  
  
చనవున నాపె నీతో జాణతనాలాడెనంటా
పెనగొని యెన్నేసి బీరా లాడేవు
మనసురాని యెడల మంచితనాలు సేసితే
యెనసినంతేకాక యెక్కుడయ్యీనా॥మేల॥
  
  
వొద్దనుండి యాకె నిన్ను వొడివట్టి తీసెనంటా
గద్దించి యెందాఁకా బింకాలు చూపేవు
పెద్దరికానకు నెంత ప్రియముతో మొక్కినాను
తిద్దుకొనే మంటేను చేతికి లోనయ్యీనా॥మేలు॥
  
  
కమ్మర నప్పటి నాపె కాఁగిలించుకొనెనంటా
నమ్మించి బాసలు మిన్నక చేసేవు
ఇమ్ముల శ్రీ వేంకటేశ యేలితివి మా చెలిని
సమ్మతాయ నిఁక మరి జంట వాసీనా॥మేల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!