Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12697

మేలు గలితే నిందుకు మెచ్చవద్దా నీవిట్టె

రాగము: ఆహిరి

మేలు గలితే నిందుకు మెచ్చవద్దా నీవిట్టె
యీ లేమతో జాణతనా లెంతాశాడేవయ్యా॥పల్లవి॥
  
  
కలికితనాలనే కరఁగించె నీమనసు
చిలుకుఁ జూపుల నిన్నుఁ జిమ్మిరేఁచెను
నిలువుఁ గొలుపు సేసి నిన్ను మరిగించుకొనె
చెలితో నీవెట్టు సాముసేసేవయ్యా॥మేలు॥
  
  
నవ్వుతానే నీతోడ ననుపులు సేసుకొనె
వువ్విళ్ళూర మాఁటాడి వొడఁబరచె
వివ్వటిల్లఁ గళలంటి నిన్ను నిట్టె దక్కఁగొనె
జవ్వని నీవెటువలె సాదించేవయ్యా॥మేలు॥
  
  
చుట్టరికముననే చొక్కులఁ బెట్టె నిన్ను
గుట్టుతోనే రప్పించుకొనె నింటికి
గట్టిగా శ్రీవేంకటేశ కందువఁ బెండ్లాడె నీతో
నిట్టి యలమేలుమంగ నెట్టు గెలిచేవయ్యా॥మేలు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!