Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12698

మేలు గలంతాను మెరసేను

రాగము: సింధురామక్రియ

మేలు గలంతాను మెరసేను
తాలిమితో నిట్టే మా దండకు రావయ్యా॥పల్లవి॥
  
మనసొక్కటాయ నింక మామాట వింటివి
ననుపై నాసెలవికి నవ్వువచ్చెను
చెనకఁగానే నాకు చేయి మీఁదాయ నేఁడు
తనిసితి మింకాను మాదండకు రావయ్యా॥మేలు॥
  
చలమెల్ల నీడేరె చనవు మాకిచ్చితివి
కళలు నా మోమునఁ గడు నిండెను
కొలువులో నుండఁగానే కూటములు దైవారె
తలకొని యిపుడు మాదండకు రావయ్యా॥మేలు॥
  
నిండెను సంతోసము నెమ్మది నన్నేలితివి
మెండుగ శ్రీవేంకటేశ మెచ్చితి నిన్ను
పండుమోవితేనెతోనే ఫలమందె రతులెల్లా
దండియై యున్నాఁడవు మాదండకు రావయ్యా॥మేలు॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!