Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12723

మేలు మేలు దొరవౌదు మెస్తిరా నిన్ను

రాగము: మాళవిగౌళ

మేలు మేలు దొరవౌదు మెస్తిరా నిన్ను
తాలి మింత లేకున్న తగుదువా మాకును॥పల్లవి॥
  
  
చేరి నే దూరితే నీవు సెలవినే నవ్వుదువు
వేరెవెంగె మాడితేను వేడుకొందువు
వోరు పింత లేకున్న నూరఁగల గొల్లెతలు
వారికివారే వలచి వత్తురా నీకును॥మేలు॥
  
  
కన్నుల నే జంకించితే కడుఁ జేత మొక్కుదువు
పన్ని నేఁదిట్టితే నన్నుఁ జాలార్చేవు
అన్నేసి నేరకున్న నసుర కామినులెల్ల
చిన్ని నీమాటల కెల్లఁ జిక్కుదురా నాఁడు॥మేలు॥
  
  
వొద్దని నే నలిగితే నొడివట్టి పెనఁగుదు
గద్దించితే నట్టె నన్నుఁ గాఁగిలింతువు
వుద్దండ మింత లేకున్న నొగి నిందిరయు భూమి
యిద్దరు శ్రీ వేంకటేశ యెనతురా నిన్నును॥మేలు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!