Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12724

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: బౌళి

మేలు మేలు నీ కతలు మెచ్చితిమయ్యా
యేలుకొంటి విందరిని యెంతవాఁడవయ్యా॥పల్లవి॥
  
  
చల్లువెడమాట లాడి సతులవలపులెల్ల
కొల్లగాఁ గలయఁ బెట్టి ఆలు గుంపు సేసేవు
అల్లి బిల్లి సేసి కూడి ఆలు మోపులుగట్టి
యెల్లవారిమీఁద వేసే వెంతవాఁడవయ్యా॥॥
  
  
వాడికనవ్వులు నవ్వి వనితల మానములు
కూడపెట్టి లోలోనే గుది గుచ్చేవు
యీడుజోడుగాఁ బెనఁగి యింపులు మచ్చులువేసి
యీడేరించితివి మమ్ము నెంతవాఁడవయ్యా॥॥
  
  
మోవితీపులు మరపి ముదితల జవ్వనాలు
భావముల వడివెట్టి పచ్చిరేఁచేవు
శ్రీ వేంకటేశ నాపై సిగ్గులు నానఁబెట్టి
యీవల నన్నుఁగూడితి వెంతవాఁడవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!