Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12793

మొకము చూచుటే మొక్కుటే చాలు

రాగము: తెలుఁగుఁగాంబోది

మొకము చూచుటే మొక్కుటే చాలు
యెకసక్కెమాయఁ బని యేలరా యీ దోసము॥పల్లవి॥
  
  
వట్టిపను లెల్లఁజెప్పి వద్దివారి నెల్ల నంపి
వొట్టుక నన్నుఁ జెనకే వోరీ నీవు
గట్టిగా నావూళిగపుకాంతల నంటితివట
యిట్టె నన్నుఁ బైకోనేవు యిఁక వొద్దు దోసము॥మొక॥
  
  
యేకతాలు గడియించి ఇంటిలోనికిఁ బిలిచి
యీకడ నన్ను బోదించే వేరా నీవు
ఆకుమడి చిచ్చేటిఅంగన నంటితివట
నీకు నాకు నింతచాలు నిలు నిలు దోసము॥మొక॥
  
  
అలసితి నని వచ్చి అంగము పై వేసేవు
చెలఁగి కాఁగిలించేవు చెల్లురా నీవు
బలిమి నన్నుఁ గూడితివి పంతపు శ్రీవేంకటేశ
తొలఁగి కిమ్ముల పొందు తొడుకకు దోసము॥మొక॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!