Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12876

మంకుఁదన మేమిటికి మగువలకు

రాగము: వరాళి

మంకుఁదన మేమిటికి మగువలకు
అంకెకు వచ్చి యిచ్చకమాడరాదా యిపుడు॥పల్లవి॥
  
  
నేటిపతితో మాకు నగక వుండితేను
యెగసక్కెమై వుండదా యెవ్వరికైనా
వెగటేమి గలిగినా వెనక సాదింతుగాని
మొగము చూపి చేయెత్తి మొక్కరాదా యిపుడు॥మంకుఁ॥
  
  
పలుమారుఁ బిలువఁగఁ బలుకకవుండితేను
అలిగినట్టుండదా అందరికిని
మలసి నీచలమెల్లా మాపు చూపుదువుగాని
యెలమిఁ జేతికి వీడెమియ్యరాదా యిపుడు॥మంకుఁ॥
  
  
ఆతఁడు గాఁగిలించఁగా నట్టె కాఁగిలించకుంటే
యేతులని యెంచరా యింతులెల్లాను
యీతల శ్రీవేంకటేశు నింకాఁ గూడుదువుగాని
చేతనైనపాటి సేవసేయరాదా యిపుడు॥మంకుఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!