Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12878

మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును

రాగము: లలిత

మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ - జయజయ॥పల్లవి॥
  
  
ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు॥మంగళము॥
  
  
హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా-
కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు॥మంగళము॥
  
  
పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు॥మంగళము॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!