Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12946

యిట్టుండ వలదా యెన్నికైన నీ గుణము

రాగము: కాంబోది

యిట్టుండ వలదా యెన్నికైన నీ గుణము
అట్టే నిన్నుఁ జూచి నాకు నరుదాయను॥పల్లవి॥
  
  
మక్కువ తోడుత నా మనసు నీవె యెఱిఁగి
చక్కెర నీ మోవియ్యఁగ సంతోసమాయ
తక్కక యప్పటి నా తమకము గనుఁగొని
వెక్కసాన నవ్వఁగాను వేడుకాయను॥॥
  
  
వోముక నే విన్నవించే వుపమ నీకే తెలిసి
ఆ మాటే నాతో నాడఁగ నరు దాయను
కామించిన నాయాస గక్కన విచారించి
ప్రేమతోఁ గౌఁగిలించఁగ ప్రియ మాయను॥॥
  
  
యిందు నా కళలలో నీ యిక్కువలు నీవే యంటి
అంది రతులఁ గూడఁగా నానంద మాయ
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
సందడి నన్నేలఁ గాను సమ్మతే యను.॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!