Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13013

యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను

రాగము: కన్నడగౌళ

యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను
ముట్టిన నా మతిలోను మోహము చెప్పితిని॥పల్లవి॥
  
  
విరహాగ్నిఁ గాఁగి నిన్ను వెంగె మాడఁ దలఁతును
కరఁగి యంతలో నాడక మానుదును
విరుల యమ్ములు నాటి వేయఁ బూనుదు పూవుల
పరగ నా మేలుగానే భావించి వూరకుందు॥॥
  
  
తమక మాఁపఁగ లేక దాకొని జంకించిఁ జూతు
మమత తో జంకించక మరి సొలతు
వుమురు వెన్నెలకుఁగా కుహింతు నిన్నుఁబైకొన
భ్రమసి నీవే నే నని భావించి వూరకుందు॥॥
  
  
కోవిల కూతలకుఁగా కూచుందు నీ తొడమీఁద
కావిరిఁ గూచుండ కటు కౌఁగిలింతును
శ్రీ వేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టే
భావము లొక్కటిగానే భావించి వూరకుందు॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!