Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13014

యెట్టున్నదో నా భాగ్యమేమి సేతునే

రాగము: తెలుఁగుఁగాంబోది

యెట్టున్నదో నా భాగ్యమేమి సేతునే
చుట్టిచుట్టి నాయాసలు సుడిగొన నిపుడు॥పల్లవి॥
  
చెలిచే నా విన్నపాలు చిత్తగించి వినునొకో
తలఁపునఁ బెట్టు నొకో దయతోను
పిలిచితే వచ్చునొకో ప్రియముతో నాయింటికి
కలసునొకో నేఁడు కౌఁగిట నా విభుఁడు॥॥
  
కడఁగి నే నంపిన కాని కందుకొనునొకో
అడుగునొకో నన్నందరిలోన
యెడయక నాకు నట్టే యిచ్చునొకో కెమ్మో
అడరి నాకుఁ గైవస మౌనొకో నా విభుఁడు॥॥
  
తమితో నా చన్నులపై తానే చేయి చాఁచునొకో
అమరఁగ నవ్వునొకో ఆతుమఁదాను
మమకరిం చలమేలుమంగ శ్రీ వేంకటేశుఁడు
సమరతి నన్నేలె యీ జాణఁడే నా విభుఁడు॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!