Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13016

యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము

రాగము: బౌళి

యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము
ఇట్టిదని రమణుని కెఱిఁగించరే॥పల్లవి॥
  
ముచ్చటెంతైనాఁ దీరచు మోహము గల వారికి
మచ్చికతో సారె సారె మాట లాడినా
వచ్చిరాని పద్యములె నుండు నడియాస
కొచ్చి కొచ్చి యెంతేసి కొసరినాను॥॥
  
తని వేమిటాఁ బొందదు తమకించేవారికి
పెనఁగి పెనఁగి యెంత ప్రియపడినా
వినియు వినని మాట విధమై యుండుఁ దలఁపు
కనుఁ గొని యెదుటనే కాచుకుండినాను॥॥
  
తగు లెంతైనాఁ బాయదు తతిఁ గూడిన వారికి
నగి యెటువలె గోరు నాటించినాను
తగ శ్రీ వేంకటేశుఁడు తానే వచ్చి నన్నుఁగూడె
చిగురుఁ జేగై వుండు చిమ్మి రేఁచినానూ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!