Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13049

యెంత కుచ్చితురాలంటా నేల నన్ను దూరేవు నీ-

రాగము: ముఖారి

యెంత కుచ్చితురాలంటా నేల నన్ను దూరేవు నీ-
చెంత నాకె వుండఁగాను సిగ్గుపడవలదా॥పల్లవి॥
  
ఆకె నీవు నేకతము లాడుకొంటా నుండఁగాను
నాకిటను నిలుచుండవద్దా నాకు
చేకొని మీలో మీరు చేసన్నలు నేసుకోఁగా
దాకొని పరాకు సేయఁదగవు గాదా॥॥
  
చాయల నాకె నీవు సారె మొగాలు చూడఁగా
చేయి మాఁదువెట్టు కోను చెల్లదా నాకు
పాయక మీ రిద్దరును పచ్చడము గప్పుకోఁగా
యీ యెడ నే జూజమాడే దితవే కాదా॥॥
  
అలమేలుమంగ వురమందు నీకు నుండఁగాను
తలవంచుకొని మొక్కవలెఁగా నాకు
యెలమి శ్రీ వేంకటేశ యేలితిరి మీరిద్దరు
వెలయ మిమ్ముఁ గొలువ వేడుకే కాదా॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!