Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13054

యెంతటి నేరుపరివి యేమని పొగడవచ్చు

రాగము: పూర్వగౌళ

యెంతటి నేరుపరివి యేమని పొగడవచ్చు
వింత నీ సుద్దులు చూచి వేడుకాయ నాకును॥పల్లవి॥
  
  
చనవిచ్చి నీవు మోవి చవులు చూపఁగాను
తనివిఁ బొందె నాతలఁ పెల్లను
మునుకొని నీవు నామొగమై నిలువఁగాను
పెనగొన్న సంతోసము పెడరేఁగె నాకును॥॥
  
  
పక్కన నీవు నాకు బాగా లొసగఁగాను
యిక్కువలు గరఁగను ఇంతలోనె
చెక్కు నొక్కి నీవు నన్ను సిగ్గులు దేరుచఁగాను
నెక్కొన్న కోరికలు నెరవేరె నాకును॥॥
  
  
కందువ నుండినన్నుఁ గౌఁగిలించుకొనఁగాను
చిందె నా సెలవులనుఁ జిరునవ్వులు
యిందునే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
పొందితివి రతుల నీభోగ మబ్బె నాకును॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!