Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13057

యెంతని చెప్పే నేను యేమని వినేరు మీరు

రాగము: కుంతలవరాళి

యెంతని చెప్పే నేను యేమని వినేరు మీరు
సంతతము దైలువారి చల్లు వెద(?)లాడీనే॥పల్లవి॥
  
మనసునఁ దాగే పాలు మరి లెక్కవెట్ట నేల
గొనకొని గుక్కిళ్ళు కొలవ నేల
నినుపులై యీతనికి నే వలచిన వలపు
యెనలేక చెలులాల యేల నన్నడిగేరే॥॥
  
సెలవి నవ్విన నవ్వు చేటఁ డేమి గంపెఁ డేమి
పలుకు లెన్నేయ నేమి పదర నేమి
పలుమారు నాతని పైఁ బెట్టిన యాసలు
కొలచి కొలచి యెంత గుట్టు దెలిసేరే॥॥
  
వేడుకై నరతులకు వెలలు చెప్పఁగరాదు
వాడిక మోవితేనె వడ్డించరాదు
యీడనె శ్రీ వేంకటేశుఁ డింత సేసె నన్నుఁగూడి
యీడువెట్టి మిమ్మిందరి నేలితేనే మెచ్చేరే॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!