Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13083
యేమని విన్నవించేము యెవ్వరినిఁ గాదనేము
రాగము: ఆహిరి
యేమని విన్నవించేము యెవ్వరినిఁ గాదనేము | |
కోమటిసాకిరులాయ గొబ్బున మా మాఁటలు | ॥పల్లవి॥ |
సరసము లాడఁగానే జామువోయఁ దెల్లవారె | |
తరవులు వెట్టి మాకు దగదొట్టెను | |
శిరసు వట్టి చెనకఁగఁ జెనకఁగ | |
తరుణి సిగ్గులువడి తలవంచె నదివో | ॥యేమ॥ |
యెగసక్కేలాడఁ గానే యెండగాసె నీడవచ్చె | |
తగవులు చెప్పి మాకుఁ దడవాయను | |
బిగువెక్కెఁ గుచములు పిలువఁగఁ బిలువఁగ | |
మగువ జవ్వనమున మదమెత్తెనదివో | ॥యేమ॥ |
చేతులు చాఁచఁగానే చీఁకటెల్లా వెన్నలాయ | |
నీతులు బోదించ మాకు నెపమాయను | |
యేతుల శ్రీ వేంకటేశ ఇట్టె నీవు గూడఁ గూడ | |
యీ తరుణి వురము పై నిరవాయ నిదివో | ॥యేమ॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు