Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13108

యేల బయ లీఁదించేరే యింతులాల

రాగము: వరాళి

యేల బయ లీఁదించేరే యింతులాల
మేలిమి బత్తి గలిగితే మీ రాతనిఁ దేరే॥పల్లవి॥
  
తప్పక చూచినాను తనివోని యాసలు
వొప్పుగ నెడ మాటల నూరడిలీనా
ముప్పిరి నెడ మాటల ముంచుకొన్న వేడుక
చప్పు డాలించి నంతలోఁ జాలఁబోయీనా॥॥
  
సరసము లాడినాను జడియని వలపులు
తెరమాఁటు సన్నలనుఁ దీర్చవచ్చీనా
నిరతపు సన్నల నిండు కొన్నకోరికెలు
గరిమ నవ్వినంతనే కాఁక వాపీనా॥॥
  
కాయముఁ గాయముఁ గూడి కడివోని తమకము
చేయెత్తి సేసవెట్టి తే సెలవయ్యీనా
యీ యెడ శ్రీ వేంకటేశుఁ డే నలమేలుమంగను
చాయకు వచ్చి నన్నేలె జంట వాసీనా॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!