Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13132

రచ్చలఁ బడె వలపు రావయ్యా

రాగము: నాదరామక్రియ

రచ్చలఁ బడె వలపు రావయ్యా
చెచ్చర వచ్చి ప్రియాలు చెప్పించుకోవయ్యా॥పల్లవి॥
  
  
దగదొట్టెవలపు తరుణి నిట్టూర్పుల
యెగసక్కెములు సేసే వేమయ్యా
చిగిరించెవలపు చిత్తములో కోరికల
మొగముచూచియైన మొక్కించుకోరాదా॥రచ్చ॥
  
  
కుచ్చిపారీ వలపులు కొమ్మచెమట యేరుల
మచ్చరమేమి గల్లాను మానవయ్యా
పచ్చనాయ వలపులు పలు పులకపైరుల
ముచ్చటాడి ఆపెచేత మొక్కించుకోరాదా॥రచ్చ॥
  
  
నాని విరిసె వలపు నాతి సెలవినవ్వుల
లేని తరితీపుమాని లేవయ్యా
కోనల శ్రీవేంకటేశ కూడితిరి మీరిద్దరు
మోనాన నూరకే యిట్టె మొక్కించుకోరాదా॥రచ్చ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!