Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13135

రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు

రాగము: దేసాళం

రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు
గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే॥పల్లవి॥
  
  
చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు
పలుమారు మాటలాడి పదరీ వీఁడు
మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద
చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే॥రట్ట॥
  
  
పందెములడువరాదు పంతము విడువరాదు
కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు
అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద
చందపు మావలపులు చక్కఁబెట్టరే॥రట్ట॥
  
  
తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు
అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు
చెమటల నామేను చేఁతసేసీఁ దనమీఁద
జమళి మమ్మిద్దరిని సారె మెచ్చరే॥రట్ట॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!