Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13148

రమణి నేర్పు నేరములాయె

రాగము: భైరవి

రమణి నేర్పు నేరములాయె
జమళి విధుల సరసపు విభుఁడా॥పల్లవి॥
  
  
తెఱవకు నంపిన తెల్లని కలువలు
మఱపున కెందామర లాయె
నెఱుఁగము నీవిపు డింతచేతువని
కఱతలకలికివి గా విభుఁడా॥రమణి॥
  
  
మగువకు నంపిన మకరంద మిచ్చటి
జిగి దొలంకేటి చిఱుచేఁదాయె
అగు నీ యెకసక్యమ్ముల మాటల
వగ నెఱజాణండవా విభుఁడా॥రమణి॥
  
  
చెంతల ముత్యపుం జిప్పల తోయము
లంతలోనె ముత్యములాయె
సంతత కరుణా జలనిధి లక్ష్మీ
కాంతుఁడవఁట వేంకట విభుఁడా॥రమణి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!