Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13181

రమ్మనవే యిఁకనేల రవ్వసేయక

రాగము: మాళవిగౌళ

రమ్మనవే యిఁకనేల రవ్వసేయక
పమ్ముకొన్న తమకము పారిపోవనిచ్చునా॥పల్లవి॥
  
  
తనియని నా మనసు తనుఁ గోరకుండునా
చెనకి నా ప్రియములు చేకొనుఁగాక
మునుకొన్న చూపులు మోము చూడకుండునా
యెనసి నా చేఁతలకు నియ్యకొనుఁగాక॥రమ్మ॥
  
  
కోమలపు నా వయసు కొంగు వట్టించకుండునా
దీమసానఁ గూడ సమ్మతించుఁగాక
దోమటి నా వలపులు తొలఁగఁగ నిచ్చునా
నా మాటలు దోయక నన్ను నేలుఁగాక॥రమ్మ॥
  
  
కందువ నావలపులు కలయఁబెట్టకుండునా
ఇందరిలో నాకుఁ జనవిచ్చుఁగాక
పొందులు శ్రీవేంకటేశుఁ బొనుఁగఁగ నిచ్చునా
చెందె నన్ను నిఁక నిట్టె చెలఁగించుఁగాక॥రమ్మ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!